ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్..

cpi-29.jpg

నీతి ఆయోగ్‌ సమావేశంలో దేశం అభివృద్ధి చెందిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందందని, అన్ని రంగాల్లో దూసుకుపోతోందని నీతి అయోగ్ సమావేశంలో అసలు దేశం ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చంద్రబాబు ప్రజకు సమాదానం చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర విధానాల వల్ల దేశంలో 1.2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అభివృద్ధి అని ఎలా చెపుతారని నిలదీశారు. 40 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్న విషయాన్ని పరిగణనలలోకి తీసుకోవాలని సూచించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక పేదరికంలో భారత్‌ ప్రథమ స్థానం వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులపై అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

Share this post

scroll to top