ఏపీలో మహాశివరాత్రి వేడుకల సందడి..

siva-26.jpg

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు, శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం స్వామి, అమ్మవార్లు పుష్ప పల్లకిలో విహరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వేడుకలతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Share this post

scroll to top