ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు..

anjira-11.jpg

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైఫూట్స్ తప్పనిసరి డైట్‌లో ఉండాలి. అయితే డ్రైఫూట్స్‌లో అంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని డైలీ తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవని నిపుణులు సూచిస్తున్నారు. 

నానబెట్టి ఉదయాన్నే తింటే..

ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్ పండ్లను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే పరగడుపున అంజీర్‌ను తినడం మంచిది. వీటిని తినడం వల్ల ఉదయం పూట అలసట, నీరసం అన్ని పోయి రోజంతా యాక్టివ్‌‌గా ఉంటారు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీనడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోవడంతో పాటు మలబద్దకం కూడా పోతుంది. 

అంజీర్‌లో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, విటమిన్‌ కే, ఏ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ రాకుండా ఉంచడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్‌ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Share this post

scroll to top