నేటి నుంచి ఇంద్ర కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు..

dasara-03.jpg

విజయవాడ అమ్మవారి భక్తులకు అలర్ట్. ఇంద్ర కీలాద్రిపై ఇవాళ్టి నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దుర్గ గుడి ఈఓ రామారావు ప్రకటన చేశారు. ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశామన్నారు. ఈ ప‌ది రోజులు ప‌ది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు దుర్గ గుడి ఈఓ రామారావు. ఈ ఏడాది లేజర్‌షో కృష్ణమ్మకు హరతి ఏర్పాటు చేశామని ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం, 12వ తేదీన తెప్పోత్స‌వం, పూర్ణాహుతి ఉంటుందని చెప్పారు దుర్గ గుడి ఈఓ రామారావు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 దర్శన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయన్నాఋ.విజయవాడ ఇంద్ర కీలాద్రి కొండ‌పై గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేశామని.. మ‌రింత‌ సమాచారం కోసం అందుబాటులోకి ద‌స‌రా మహోత్స‌వం 2024 యాప్‌ ఉందని చెప్పారు దుర్గ గుడి ఈఓ రామారావు.

Share this post

scroll to top