ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక భేటీ..

rajanath-singh-28.jpg

ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పాక్ సైన్యం కాల్పులపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించారు. ఒక్కరోజు భేటీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భద్రతా సిబ్బంది సంసిద్ధత గురించి ప్రధానికి రాజ్‌నాథ్‌సింగ్ వివరించనున్నారు. పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను మోడీకి వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటూ తిప్పికొడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నారు.

Share this post

scroll to top