ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు. ఇది ఆనందించే సమయం కాదు స్వాతంత్య్ర సమర యోధులను గుర్తించాలి. 78 ఏళ్ల క్రితం ఇదే సమయానికి తెలంగాణ, పంజాబ్ కి స్వాతంత్య్రం రాలేదని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహం ముందుకు వెళ్తున్నాం మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టుకున్నాం పేద వారి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసే క్యాంటీన్ లకు ఎన్టీఆర్ పేరు పెట్టామని తెలిపారు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన పవన్..
