ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, భారీ బందోబస్తు మధ్య ఆయన పర్యటన కొనసాగనుంది.
మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న పవన్..
