రిలీజ్‌కి ముందే సరికొత్త రికార్డ్..

devara-10.jpg

ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు సాయంత్రం దేవర ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. RRR తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేవర సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. అయితే రిలీజ్ కి ఇన్ని రోజుల ముందే ఆన్లైన్ బుకింగ్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది దేవర. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ విషయం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అత్యధిక వేగంగా రిలీజ్ కి ముందు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమా దేవరనే కావడం గమనార్హం. ఇంకా రిలీజ్ కి 17 రోజులు సమయం ఉంది. ఈ లోపు ఇంకెన్ని మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందో దేవర చూడాలి.

Share this post