మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్..

bjp-23-.jpg

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 210కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా, దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. మాకు దాదాపు 125 సీట్లు రాబోతున్నాయి. ఇక, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top