అల్లుఅర్జున్ ఏమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో యుద్ధం చేశాడా..

ravanth-reddy-14-.jpg

రాష్ట్రంలో అల్లు అర్జున్ అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆయన్ను ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు బెయిల్ వచ్చినా కూడా ప్రభుత్వం కావాలని ఒక రోజు జైలులో ఉంచిందని రేవంత్ సర్కారు మీద ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డిని అక్కడి నేషనల్ మీడియా ప్రశ్నించగా అల్లు అర్జున్ ఏమైనా ఇండియా-పాకిస్తాన్ బోర్డర్‌లో యుద్ధం చేశారా? తనొక సినిమా యాక్టర్. డబ్బులు పెట్టుబడి పెట్టి, నటించి తిరిగి వాటిని సంపాదించుకుంటారు. అంతకుమించి ఏముంది? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Share this post

scroll to top