టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. తాజాగా రష్మిక మాత్రం ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పేసింది. అసలేం జరిగిందంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘గం. గం.. గణేశా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకకు నటి రష్మిక మందన్న చీఫ్ గెస్టుగా వచ్చింది. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆనంద్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా సమాధానాలిచ్చింది.
మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్? అని ఆనంద్ అడగ్గా.. ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) అని రష్మిక సమాధానం ఇచ్చింది. అయితే రష్మిక ఇచ్చిన ఈ ఆన్సర్తో ఈ జంట రిలేషన్షిప్లోనే ఉందంటూ నెట్టింట చర్చ మళ్లీ మొదలైంది. ఆనంద్ను ఫ్యామిలీ అనడంతో ఇండైరెక్టుగా విజయ్తో రిలేషన్షిప్ కన్ఫమ్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.