ధైర్యంగా ఉండండి పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక సూచనలు..

ys-jagan-30.jpg

ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పలువురు వైఎస్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

Share this post

scroll to top