కొన్ని క్షణాలు ఆ టైంలో షాక్‌ లో ఉండిపోయా..

desa-patani-18.jpg

లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. ఈ క్రంమలోనే ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ నటించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం హిట్ కాగా తాజాగా వచ్చిన కంగువ కూడా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. తమిళ స్టార్ సూర్య డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తోంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాని ‘కంగువ’ సినిమాలో తనకు ఆఫర్ వచ్చినప్పటి విషయాలు షేర్ చేసుకుంది.

ఈ మేరకు దిశా పటానీ మాట్లాడుతూ.. ‘‘కంగువా’ లాంటి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో భాగమవ్వడం నిజంగా నా అదృష్టం. ఇందులో ఆఫర్‌ రాగానే నమ్మలేకపోయా. సూర్య సర్‌కు జోడిగా నటించబోతున్నానని తెలిసి కొన్ని క్షణాలు షాకయ్యా. తర్వాత తేరుకొని ఎగిరిగెంతేశా సూర్యతో పనిచేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఆయన కళ్లే ఎక్కువగా మాట్లాడతాయి. కంగువ షూటింగ్ నాటి విషయాలు ఎప్పటికి మర్చిపోలేని’ అంటూ చెప్పుకొచ్చింది.

Share this post

scroll to top