విజయం అంత సులభంగా రాలేదు..

hero-in-1.jpg

నటనపై ఉన్న ప్రేమతో ఓ కెనడియన్ అమ్మాయి.. ఇండియాకు వచ్చి తన కెరియర్ ను ప్రారంభించింది. ఈరోజు ఈ అమ్మడు సినీ రంగంలో అద్భుతంగా దూసుకు పోతోంది. అయితే ఈ అమ్మాయికి విజయం అంత సులభంగా రాలేదు.. కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆనటి మరెవరో కాదు ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహి. కేవలం రూ.5000తో కెనడా నుంచి ఇండియాకు వచ్చిన ఈ నటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించింది.నోరా ఫతేహి 2014 లో టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ చిత్రంతో హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. నోరా 84 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో గ్లామరస్ డాన్స్ తో ఫేమస్ అయ్యింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన  బాహుబళి సినిమాలో ‘మనోహరి’ పాటకు తన గ్లామర్ కాస్ట్యూమ్ తో నోరా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

Share this post

scroll to top