ఇటీవల చాలా మంది మద్యానికి బానిసై అనారోగ్యపాలవుతున్నారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా మద్యం మత్తులో ఊగిపోతుంటారు. చిన్న చిన్న సమస్యలకే తాగుడుకు బానిస అవుతారు. కానీ దీని వల్ల ఆరోగ్యం పై సమస్యలు వస్తాయని ఆలోచించారు. అయితే కొందరు హఠాత్తుగా మద్యపానానికి గుడ్ బై చెబుతాం అనుకుంటారు. కానీ దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం..
మద్యం ఎంత పరిమాణంలో సేవించిన అవయవాలపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. వివిధ కారణాలతో కొందరు సడన్‌గా మానేస్తారు. దీనివల్ల పలువురిలో మానసిక ఇబ్బందులు, కోపం, టెన్షన్, అలసట, అయోమయం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారట. కొన్నిసార్లు న్యూరోలాజికల్ సమస్యలతో మతిమరుపు వస్తుందని పేర్కొంటున్నారు.