హీరో విశాల్ కు తీవ్ర అనారోగ్యం..

vishal-07.jpg

తమిళ హీరో విశాల్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. విశాల్ తాజా చిత్రం మదగజరాజ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు వణుకుతూ కనిపించారు. దీంతో ఆయన ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ వార్తలు హాల్ చల్ చేశాయి. ఆ ప్రెస్ మీట్ వీడియోను చూసిన విశాల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఏమైందో అని తెలుసుకునేందుకు వందలాది కాల్స్ చేయగా ఆయన టీంహెల్త్ రిపోర్ట్ ను విడుదల చేసింది. విశాల్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఆయనకు ఏమైందో విశాల్ బయట పెట్టక పోవడం గమనార్హం.

Share this post

scroll to top