డాక్టర్లు రారు..సిబ్బంది ఉండరు!

doctors-06.jpg

సంగారెడ్డి జిల్లాలోని సర్కారు దవాఖానాలపై జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నెల 4న జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, సమస్యలు వైద్య ఆరోగ్యశాఖ పనితీరుకు అందంపడుతున్నాయి. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖాన, బస్తీ దవాఖానాల్లో వైద్య సేవల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Share this post

scroll to top