చిన్నపిల్లల్లో గుండె పోటు లక్షణాలు..

hart-attick-09-1.jpg

గుండె పోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో పెద్దలే కాకుండా చిన్న పిల్లలు సైతం గుండె నొప్పితో మరణిస్తున్నారు. స్కూల్, కాలేజీల్లో, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు ఇలా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. చిన్న పిల్లల్లో గుండె పోటు వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ పెద్దలు వాటిని సరిగా గమనించడం లేదు. పెద్దలు కూడా పిల్లల ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. పెద్దల్లో వచ్చే లక్షణాలు చిన్న పిల్లల్లో వచ్చే లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయి. ముఖ్యంగా పదేళ్లు పూర్తిగా నిండని పిల్లలు కూడా గుండె పోటుతో మరణించడం అనేది ఈ మధ్య కాలంలో ఎంతో మందిని కలిచి వేస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు.

పిల్లల్లో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణాలు..

అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, అలసట, ఛాతీలో అసౌకర్యం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెలో దడ, చెమటలు ఎక్కువగా పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి. కేవలం తల్లిదండ్రులే కాకుండా స్కూల్‌లోని ఉపాధ్యాయులు సైతం పిల్లలు ఎలా ఉన్నారన్నది గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share this post

scroll to top