అంజీర్ తీపి రుచిలోనే కాదు పోషకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పురుషుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడే అనేక గుణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు కూడా నయమవుతాయి. అత్తి పండ్లలో సహజ చక్కెర, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ప్రముఖ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారా..
