ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని.. కూల్చిన ఇళ్లకు పరిహారం, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈటల పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో దమ్ముంటే ప్రభుత్వం విచారణ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. పేద మధ్య తరగతి వారు రూపాయి రూపాయి పోగు చేసి కొనుక్కున్నారని.. అన్ని అనుమతులు తీస్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..
