కాంగ్రెస్ కేసీఆర్ పై సెన్సేషనల్ ట్వీట్..

kcr-14.jpg

మాజీ సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. గురువారం ఎక్స్ వేదికగా సెన్సేషనల్ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారులపై దాడిని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నారని పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులకు రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంటూ ముసుగు వేసి, ధర్నాలు నిర్వహించి, దాడులు చేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని వెల్లడించింది.

కాగా, ఇటీవల లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటన తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Share this post

scroll to top