దేశీయ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దేశ వ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధిరేటు 10 శాతం ఉంది. 2024-25లో రాష్ట్రం కేవలం 5.1 శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జీఎస్టీ వృద్ధి 12.3 శాతమన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయి. ఆర్థిక మంత్రి సభను మాత్రమే కాదు రాష్ట్ర పౌరులను మోసం చేశారు. కొవిడ్ వేళ తప్ప ఇంత తక్కువ జీఎస్టీ వృద్ధి ఎన్నడూ నమోదు కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయింది. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి తప్పుడు విధానాలతో పెట్టుబడులు రావడం లేదు. ప్రజల చేతిలో డబ్బు లేకపోతే వినియోగం ఎలా పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంకెల గారడీతో కాకుండా వాస్తవాల ఆధారంగా పాలన అందించాలని హరీశ్‌రావు సూచించారు.
జీరో శాతానికి పడిపోయిన జీఎస్టీ వృద్ధిరేటు..
