రుణమాఫీలో సమస్యలు వీడని చిక్కుముళ్లు..

runamafi-26.jpg

జిల్లాలో రుణమాఫీ సంబురం ఒక్క రోజుకే పరిమితమైనది. రూ.లక్ష రుణమాఫీకి సం బంధించి ఒక్క రోజే రైతుల బ్యాంకు ఖాతా ల్లో మాఫీ డబ్బులను జమచేయగా ఆ తర్వా త ఆ ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడంలేదు. దీంతో రైతాంగం గత వారం రోజులుగా వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది. రైతులు ఆధార్‌ కార్డు ఇస్తే..పోర్టల్‌లో చెక్‌ చేస్తున్న అధికారులు రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను చెబుతున్నారు. తప్పితే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top