సంపద సృష్టిస్తానని చెప్పి చేతులెస్తిన చంద్రబాబు..

nani-12.jpg

పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెబుతున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు. ట్రూఅప్ ఛార్జీలు గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆమాట అన్నాను అన్నారు. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది?. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారు. 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. ఎర్రబుక్‌ అక్రమ కేసులు పెట్టడానికేనా?. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు. నచ్చినోళ్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చి ప్రాజెక్ట్‌ను నాశనం చేశారు.

Share this post

scroll to top