పోలవరంలో లాభాల కోసమే చంద్రబాబు ఆలోచించారు..

polavaram-19.jpg

చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. పోలవరంలో లాభాల కోసమే చంద్రబాబు ఆలోచించారన్న ఆయన, దాని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పోలవరం విషయంలో చంద్రబాబు తప్పిదాలే శాపంగా మారాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిందని వెల్లడించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం జాగ్రత్తగా పని చేయాలన్న మాజీ మంత్రి, మన రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి తనకున్న మీడియా బలాన్ని వినియోగిస్తోందని, దీనివల్ల ప్రజలే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని దోచుకోవాలన్న దుర్భుద్ధితో అప్పటి సీఎం చంద్రబాబు, దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి, ప్రొటోకాల్‌ ప్రకారం కాకుండా, ఇష్టానుసారం ప్రాజెక్టులో కీలకమైన మూడు పనులు ఒకేసారి మొదలు పెట్టారని, దాని వల్లే తప్పిదాలు జరిగి, నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆ శాఖ మంత్రి స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు స్వార్థం, తప్పిదం వల్ల రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోగా, వారిపై అదనంగా రూ.900 కోట్ల భారం (కొత్త డయాఫ్రమ్‌ వాల్‌కు అయ్యే ఖర్చు) పడుతోందన్న మాజీ మంత్రి, దీనికి బాధ్యులెవరని నిలదీశారు.

Share this post