కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర అవుతోంది. ఇంతలోపే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టడం చర్చనీయాంశమైంది. వైసీపీ ధర్నాను కూటమి పార్టీలు లైట్‌గా తీసుకోవచ్చు. కానీ దీని వల్ల నష్టం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. ఇటీవల కాలంలో చంద్రబాబు పదేపదే ఏపీకి పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అంటున్నారు. తాజా పరిణామాలతో పారిశ్రామికవేత్తలు మరింత భయపడుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని వేదికగా జగన్ ధర్నా చేపట్టడం, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కక్షపూరితంగా సాగుతున్నాయనే సందేశం బలంగా వెళితే, దాని ప్రభావం పెట్టుబడులపై తీవ్రంగా పడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంకేతాల్ని తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీ ధర్నా నష్టం ఏంటో చంద్రబాబునాయుడికి బాగా తెలుసు..
