వరంగల్‌ బీఆర్‌ఎస్ సభపై ఉత్కంఠ..

kcr-11.jpg

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌ లో సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే దీనికి పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది, కాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సభ అనుమతిపై పరిశీలిస్తున్నామని వారం  రోజుల్లో సభ అనుమతి పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  ఏప్రిల్ 17 లోపు సభ అనుమతి పై  నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది . అనంతరం తదుపరి విచారణ ఏప్రిల్ 17 కి కోర్టు వాయిదా వేసింది.

Share this post

scroll to top