ఒళ్లు చాలా వేడిగా ఉంటుంది. టెంపరేచర్ చూస్తే 104 డిగ్రీలు కనిపిస్తుంది. అదీ జ్వరం వచ్చిన తొలి రోజే ఇలా ఉంటే అలాంటివారికి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. అందుకే ఫీవర్ వచ్చినవారికి వెన్నులో వణుకు పుడుతోంది. మామూలుగా అయితే జ్వరం లక్షణాలను బట్టి అది ఏ రకం ఫీవరో ఓ అంచనాకు వస్తారు. దానిని బట్టి ట్రీట్ మెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడొస్తున్న జ్వరాలు ఏ రకమైనవో వాటి లక్షణాలు ఏమిటో వాటికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో కూడా కొందరు వైద్యులకు అంతుబట్టని పరిస్థితి ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన కేసులు వెలుగుచూస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు విజృంభిస్తాయి. ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం, వీధుల్లో పారిశుధ్యం లోపించడం, వాతావరణంలో మార్పులు ఇలాంటి వాటివల్ల ఎక్కువ మంది జ్వరం బారిన పడతారు.
ఫీవర్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..
