విచిత్ర ప్రవర్తనతో నటుడు బండ్ల గణేష్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతారు. ఈ క్రమంలో ఆయన న్యూస్ చానల్లు, సోషల్ మీడియాలో పలు రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతూ అప్పడప్పడు హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలో శనివారం ట్విట్టర్‌లో ఆయన సంచలన పోస్ట్ పెట్టారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినీ ప్రముఖులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపగా మరికొంతమంది సైలెంట్ గా ఉన్నారు. వారిని ఉద్దేశించి నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా సీఎంకు శుభాకాంక్షలు తెలపని వారిని ఇరకాటంలోకి నెట్టింది. బండ్ల గణేష్ తన ట్వీట్‌లో గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను. అని రాసుకొచ్చారు.
సినిమా టికెట్ రేట్లు పెంచడానికే సీఎం కావాలా..
