తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం ముగిసింది. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం నిర్ణీత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం అని తెలిపారు. 30న ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరు నమ్మోద్దు అని స్పష్టం చేశారు. అలాగే థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది . సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరిష్కరించలేరు, మాకు మేమే పరిష్కరించుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు.
థియేటర్ల బంద్ ఉండదు..
