తల్లికి వందనం పథకం ప్రారంభం..

ammmavadi-28.jpg

ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు.2025-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం రూ. 1,228 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే విద్యార్థులకు శుభవార్త తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడికి వెళ్లడం లేదని వెల్లడించారు. ప్రతీ తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా మరో సూపర్ సిక్స్ హామీని అమలు పర్చే దిశగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 2025-26 విద్యా ఏడాది నుంచి ఈ పథకం కింద రూ.15వేలు ఆర్థిక సాయాన్ని తల్లికి అందించనున్నామన్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ పథకం ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి చదివే వారికి వర్తిస్తుందని తెలిపారు.

Share this post

scroll to top