నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..

fire-27-.jpg

హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Share this post

scroll to top