కేవలం లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
దశల వారీగా రుణమాఫీ..
