పుణ్యక్షేత్రమైన తిరుమల లో ఘోర అపచారం అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్ చేశారు. ఓ మందు బాబు కొడపైన వీరంగం సృష్టించాడు, అంతేకాదు ఎవరికి ఎంత మందు కావాలంటే అంత మందు అమ్ముతా అంటున్నాడని ఆగ్రహించారు. అంటే కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రం లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం అంటూ నిలదీశారు. ఆంధ్ర ప్రదేవ్ రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా అంటూ ఫైర్ అయ్యారు ఏపీ మాజీ మంత్రి రోజా.
తిరుమలలో ఘోర అపచారం..
