వైయస్ జగన్ మెహన్ రెడ్డి జరుగుతున్న దాడులపై ఎంపీలకు దిశానిర్దేశం..

ysr-20.jpg

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో వైసీపీ ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు తప్పులు చేసి తిరిగి వైసీపీ నాయకులపైనే కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులు తమ శ్రేణులు, కార్యకర్తలపై దాడులు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకూడదనే ప్రతిపక్షాలపై అధికార పార్టీ దాడుల చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. ఇక వినుగొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో నిరసన చేస్తామని జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.

Share this post

scroll to top