పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ సీఎం జగన్. ఇక జగన్ వెంట ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా వైసీపీ నేతలు ఉన్నారు. అనారోగ్యంతో వైయస్ అభిషేక్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి ఇవాళ తెల్లవారుజామున పులివెందులకు అభిషేక్ రెడ్డి పార్థివదేహం చేరుకుంది. దింతో అభిషేక్ రెడ్డి మృతదేహానికి ఎంపీ అవినాష్ రెడ్డి, బీటెక్ రవి నివాళులర్పించారు. ఈ రోజు పులివెందులలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ సీఎం జగన్.