మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ పర్యటన ఖరారు అయింది. నేడు కర్నూలు రానున్నారు మాజీ సీఎం జగన్. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు జగన్. కర్నూలులో వైసీపీ నేత తెరనేకల్ సురేంద్ర కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు జగన్. కాగా అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఈ రోజు అంటే బుధవారం మధ్యాహ్నాం టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారు. టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు ఆళ్ల నాని చేరికకు తాను అంగీకరించినట్లు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.