విజయమ్మ నిర్ణయం ప్రకారం జగన్ షర్మిల నడుచుకోవాలి..

balineni-28.jpg

 వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల అని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి అభిమానిగా కృతజ్ఞతతో ప్రెస్ మీట్ పెట్టానని స్పష్టం చేశారు. వైఎస్ మరణంపై బురద జల్లడం మంచిది కాదని కోరారు. దీనికి నాతో సహా ఎవరు మాట్లాడటం మంచిది కాదు విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుని పార్టీ మారాడని నన్ను అంటున్నారు నాకు ఒక్కటే బిడ్డ ఒట్టేసి చెబుతున్న నేను ఆస్తి పోగొట్టుకున్న కానీ సంపాదించుకోలేదని తెలిపారు. నేను ఎంత ఆస్తి పోగొట్టుకున్న అనేది జగన్ మోహన్ రెడ్డికి తెలుసు అని వివరించారు.

Share this post