ప్రచారంలో దూసుకుపోతూ విజయంపై ధీమా

bostha-10.jpg

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దూకుడు పెంచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను కలుస్తూ తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. విశాఖ కార్పొరేట్లను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎలాగైనా సరే ఎమ్మెల్సీగా తాను గెలిచేందుకు బొత్స సత్యనారాయణ చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని వైసీపీ నాయకత్వం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వైసీపీ ప్రజా ప్రతినిధులను కలిసి దిశానిర్దేశం చేశారు. పాడేరు, అరకు, విశాఖకు సంబంధించిన వైసీపీ నేతలను కలిసి తమ అభ్యర్థి బొత్సకు ఓటు వేయాలని సూచించారు.

Share this post

scroll to top