నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్..

harish-rao.-18.jpg

నా కారు ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డాన్స్ వేసాడు అని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేసాడు. నేను మంత్రిపదవికి రాజీనామా చేసినపుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి పొట్టిగా ఉంటావు కాబట్టి నిక్కీ నిక్కీ టీవీలో కనపడడానికి చూసినోడివి. నువ్వు మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు మరి నీకు బీఆర్ఎస్ పార్టీ మీద కృతజ్ఞత ఉన్నదా అని ప్రశ్నించారు హరీశ్ రావు.

సోనియా గాంధీ బలిదేవత వెయ్యి మందిని చంపింది అన్న నీకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అన్నారు. మరోవైపు రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, వేములఘాట్ పై సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు తాము సిద్ధమని ప్రకటించారు హరీశ్ రావు. ముందు మూసీ దగ్గరికి వెళ్లి చర్చిద్దాం ఆ తరువాత రంగనాయక సాగర్ కట్టపై కూర్చుందాం అని తెలిపారు.

Share this post

scroll to top