భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే..

srinivas-goud-10.jpg

తిరుమల ఘటన బాధాకరమని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలకు భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని గతంలో నేను కోరితే టీటీడీ స్పందించి ఆలయ అభివృద్ధికి సహకారం ఇచ్చిందని గుర్తు చేశారు. తిరుమల తరహా ఈ గుడిలో కూడా స్వామి వారికి పూజలు చేస్తారన్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భగవంతుడు అందరిని చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు.

Share this post

scroll to top