కాంగ్రెస్‌కు రుణమాఫీ వేళ ఊహించని షాక్.. 

brs-30-1.jpg

రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారుపార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. ఓ వైపు అధికార కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుంగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా.. కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. 

Share this post

scroll to top