మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు..
