తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటూ కాంగ్రెస్ సర్కార్ విధానంతో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయంటూ బీఆర్ఎస్ రెండు పార్టీల వాదనల్లో వాస్తవం ఏది? సీఎం విదేశీ పర్యటన అలా ఉంటే మరోవైపు రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడాన్ని కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అదే విధంగా సీఎం మరో సోదరుడు జగదీశ్ రెడ్డికి చెందిన స్వచ్ బయో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని తప్పుపడుతోంది బీఆర్ఎస్.
మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టబడి ఉండకపోతే అమర్ రాజా ప్లాంట్ పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్దమౌతోందని సర్కార్ పై దాడి చేస్తోంది బీఆర్ఎస్. సుమారు 9 వేల కోట్ల రూపాయలతో లిథియం బ్యాటరీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తే రేవంత్ సర్కార్ ఉదాసీనత కారణంగా తరలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నది బీఆర్ ఎస్ వాదన. ఇదే సమయంలో కేన్స్ టెక్నాలజీ గుజరాత్‌కు, కార్నింగ్స్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిన అంశంపైనా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది.