రాములమ్మ ఎంట్రీ ఆ జిల్లా నేతలకు ఇష్టం లేదట..

vijayasanthi-13-.jpg

ఆమె ఎంట్రీ ఆ జిల్లా నేతలకు ఇష్టం లేదట. ఇప్పటికే మంత్రిగా ఉన్న నేతకు ఆ మహిళా నేత అంటే గిట్టదట. ఇంకో సీనియర్ నేత ఆ లేడీ ఫైర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఇలాంటి టైమ్‌లో మేడమ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చింది హస్తం పార్టీ. పైగా ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ జిల్లా హస్తం పార్టీలో కొత్త రచ్చ స్టార్ట్ అయిందట. ఇంతకీ ఆ మహిళా నేత రాక ఎవరికి ఇబ్బందికరంగా మారింది? ఏ లీడర్‌కు చెక్‌ పెట్టేందుకు ఆమెను తీసుకొచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఏడు స్థానాలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫామెన్స్ చాలా వీక్‌గా అనిపించిందట. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసమే గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతిని శాసనమండలికి సెలెక్ట్ చేశారట కాంగ్రెస్ పెద్దలు.

Share this post