తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు చేసిన పోరాటానికి ప్రభుత్వం కదిలివచ్చింది. ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాలనే మొత్తం 8 ప్రధాన డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓపీ సేవలను కూడా నిలిపివేశారు. కాగా, జూడాల సమస్యల పరిష్కారానికి సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మరోసారి చర్చలు జరిపిన ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లకు వసతి భవనాలు, కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మత్తులకు నిధులు రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో జూడాలు తమ సమ్మెను తాత్కలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా, గాంధీలో వసతి గృహాల నిర్మాణానికి, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్దరణకు నిధులు విడుదల చేస్తూ.. ఉత్తర్వలు జారీ చేసింది. కాగా మరో ఆరు డిమాండ్లు పరిష్కరించే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఫలించిన జూడాల పోరాటం వాటికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
