ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్‌..

addi-24-.jpg

బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా అని దుయ్యబట్టారు. ఆనాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరు ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు. ఆనాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్‌కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు. అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు. అని కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ మాటల యుద్ధం చేశారు. 

Share this post

scroll to top