సాయిధరమ్ తేజ్ తో నిరంజన్ సాహసం..

sai-dharma-teja-.jpg

మెగాస్టార్ మేనల్లుడుగా చిత్ర సీమలోకి అడుగుపెట్టాడు సాయిధరమ్ తేజ్.. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. కానీ, ఆ చిత్రం బాక్సఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. పిల్లా నువ్వులేని జీవితంతో మొదటి హిట్ దక్కించుకున్నాడు సాయి.. తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తూ సుప్రీం స్టార్ గా ఎదిగాడు.. కానీ, ఆ తర్వాత తిక్క, విన్నర్, ఇంటిలిజెంట్ లాంటి సినిమాలతో వరుస ప్లాప్ పలకరించాయి. కొన్నాళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సినిమాలకు దూరం అయ్యాడు సాయి.. ప్రమాదం నుంచి కోలుకుని విరూపాక్ష సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా విజయంతో కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించాడు. కాగా, అదే ఏడాది వచ్చిన బ్రో చిత్రం యావరేజ్ గా నిలిచింది.

Share this post

scroll to top