మాజీలు అయ్యేవరకు నిద్రపోం..

haroish-rao-17.jpg

సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతాం. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. 2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభం అయ్యింది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రానున్న రోజుల్లో మనదే అధికారం’’ అంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. మాజీలు అయ్యేవరకు నిద్రపోమని పార్టీ మారిన మహిపాల్ రెడ్డిపై హరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిపాల్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ తల్లిలా అక్కున చేర్చుకుంది. మూడు సార్లు ఎమ్మెల్యేని చేసింది. బీఆర్‌ఎస్‌ ఏం తక్కువ చేసిందని పార్టీ మారారు. ఫిరాయింపులకు పాల్పడేందుకు ఆయనకి మనసు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top