తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో.. ఆ పారిశుద్ధ్య కార్మికుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చేసేదేమీ లేక చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరం..
